Andhra PradeshEast GodavariNews

ముంపు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే. బాలరాజు.

ముంపు బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే. బాలరాజు.

కోస్తా ఎన్ కౌంటర్ టీ నర్సాపురం. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం టీ నర్సాపురం పంచాయతీ ఎర్ర చెరువు లో నివసిస్తూ వరద ముంపుకు గురైన బాధితులను ఎమ్మెల్యే గౌరవ శ్రీ తెల్లం బాలరాజు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం బాధితులకు వెంటనే అందించాలని ఆయన తెలిపారు. బాధితులు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా బియ్యం పంపిణీ చేశారు. ఇలాంటి  వరద ముప్పు పునరావతం కాకుండా కచ్చా డ్రైనేజ్ కు శంకుస్థాపన చేశారు. అనంతరం ముంపుకు గురైన పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ముత్యాల రావు కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comment here