Andhra PradeshEast GodavariNews

*మూడవ పంటగా రైతులు అపరాలు సాగు చేయడం*

*మూడవ పంటగా రైతులు అపరాలు సాగు చేయడం*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* వ్యవసాయ శాఖ సూచనలు ననుసరించి మూడవ పంటగా రైతులందరూ అపరాలు సాగు చేయాలని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కోట బాబు రావు విజ్ఞప్తి చేశారు. గురువారం మండల పరిషత్ సమావేశ హాలులో మండల స్థాయి వ్యవసాయ సహా యం మండలి సమావేశం జరిగింది. వ్యవసాయ అధికారి కె ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చైర్మన్ బాబూరావు మాట్లాడుతూ మండలంలోని రైతుల సమస్యలను సలహా మండలిలో చర్చించి జిల్లా అధికారులకు నివేదిస్తామన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, సలహా మండలికి వివరించి, ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు పొందుతుండాలని కోరారు. ఏవొ.కె. ప్రభాకర్ మాట్లాడుతూ పంట నమోదు ప్రక్రియలో ఈ కేవైసీ రైతులందరూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతులంతా సామూహిక ఎలుకల నివారణ చేపట్టినప్పుడే, పంట నష్టం తగ్గి, సత్ఫలితాలను పొందవచ్చు నన్నారు. నాణ్యమైన ఎరువులు, పురుగుమందులను రైతు భరోసా కేంద్రాలు ద్వారా పొందవచ్చునని వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ మల్లపురెడ్డి శ్రీను,వ్యవసాయ మండలిసభ్యులు పాల్గొన్నారు.

Comment here