Andhra PradeshEast GodavariNews

మెగా రక్తదాన శిబిరం

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం తాళ్ళరేవు మండలం పి మల్లవరం వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్య దర్శి కుడుపూడి శివన్నారాయణకు ఘనంగా నిర్వహించిన పుట్టినరోజు వేడుక భారీ ఎత్తున పాల్గొన్న వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు కరోనా లాంటి విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలిచి మండలంలో వేల మందికి కాయగూరలు నిత్యావసర సరుకులు కొంత డబ్బు సహాయం మరియు ఐసోలేషన్ వార్డు లకు మంచాలు, ఐసోలేషన్ సంబంధించిన సౌకర్యాలు మరెన్నో సేవలు చేసి ప్రజల్లో నిలిచారు.తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఇలాంటి నాయకుడు సుఖ సంతోషాలతో ఉండాలని తాళ్ళరేవు మండల, గ్రామా ప్రజలు ఆశీర్వదించారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్య దర్శి కుడుపూడి శివన్నారాయణ మాట్లాడుతూ ఇలాంటి అభిమానుల్లో ఉండటం నా అదృష్టం అని ఆయన ప్రజలకు మరింత సేవలు అందిస్తానని తెలిపారు. అనంతరం అభిమానులు కార్యకర్తలు నాయకులు మాట్లాడుతూ గతంలో సర్పంచిగా ఉన్నప్పటినుండి కూడా ఎన్నో సేవలు అందించారాని, ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

Comment here