Andhra PradeshEast GodavariNews

మైనర్లకు వాహనాలివ్వడం నేరం

*మైనర్లకు వాహనాలివ్వడం నేరం*

*రాయవరం ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎం సురేష్*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మైనర్లకు వాహనాలివ్వడం నేరమని, వారి తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారని ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎం సురేష్ హెచ్చరించారు. సోమవారం ఎస్ ఐ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. వాహనాలు నడిపే వారు లైసెన్సు, ఇన్సూరెన్స్ తదితర రికార్డులను అప్డేట్ చేసుకోవాలన్నారు. త్రిబుల్ రైడింగ్ నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటోలు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని, కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరించారు.అంతకుముందు నాకాబందీ నిర్వహించి 20 ఈ చలాన్ల ద్వారా 11095 రూపాయల జరిమానా విధించినట్లు ఎస్ ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఐ పి. వెంకటేశ్వరరావు, హెచ్ సి మాధవ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Comment here