Andhra PradeshEast GodavariNews

యానిమేటర్లు ధర్నాకు మద్దతు..

యానిమేటర్లు ధర్నాకు మద్దతు..

కోస్తా ఎన్ కౌంటర్ గోకవరం:  మండల కేంద్రంలో వెలుగు కార్యాలయం వద్ద యానిమేటర్లు చేస్తున్న ధర్నా కార్యక్రమం నాలుగవ రోజుకి చేరింది .ఈ రోజుతో ధర్నా కార్యక్రమం ముగుస్తుందని సీఐటీయూ నాయకులు ప్రమీల  తెలిపారు..యానిమేటర్లు చేస్తున్న ధర్నాకు మండలంలో నాయకులు మద్దతు పలికారు. వైఎస్సార్ పార్టీకి చెందిన నాయకులు శిబిరాన్ని సందర్శించి యానిమేటర్లు కు మద్దతు తెలిపారు.. వారు చెప్పిన సమస్యలు విన్నారు..అలాగే అంగన్వాడీ కార్యకర్తలు శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. ఈ రోజంతా వివిధ సంఘాల నాయకులు వచ్చి సీఐటీయూ నాయకులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు..తమ సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల నుండి ధర్నాలు చేస్తున్నట్లు చెప్పారు.. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ప్రమీల, మాధురి, సరోజిని కమల తో పాటు సంఘ సభ్యులు రాణి, అనంత, రాజేశ్వరి, దేవి, శారద, లక్ష్మీ, వెంకటలక్ష్మి, నాగలక్ష్మి, వాణి, సుశీల విజయమణి లు పాల్గొన్నారు.

Comment here