Andhra PradeshEast GodavariNews

యువతను మత్తుకు బానిస కాకుండా చూడాలి

యువతను మత్తుకు బానిస కాకుండా చూడాలి
– ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని సూచన
రాజమహేంద్రవరం సిటీ :
యువత మత్తుకు బానిస కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత మత్తుకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో కోనసీమ గంజాయికి కేంద్రంగా మారుతోందన్న ఆరోపణలు వస్తున్నాయని ఆరోపించారు. ఒకప్పుడు దేశంలో ఎక్కడో ఖరీదైన హోటళ్లు, పబ్బుల్లోనో లభించే డ్రగ్స్ నేడు జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని బడ్డీ కొట్లు, కిల్లీకొట్టు, టీ షాపుల్లో సైతం లబిస్తున్నట్టు, విశాఖ ఏజెన్సీ ఏరియాలో ఏడాదిగా సుమారు రూ.15 వేల కోట్లకు పైగా గంజాయి సాగవుతోందని అందరూ బహిరంగంగానే చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజమండ్రి, కాకినాడ ప్రాంతాల్లో గంజాయి, పేకాట, క్రికెట్ బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ నెల 10వ తేదీన రాజమండ్రిలో కోట్ల విలువైన టన్నుకు పైగా గంజాయి పట్టుబడిందన్న విషయాన్ని గుర్తు చేశారు. నిరాశ, నిస్పృహలకు గురైన ఉద్యోగం, ఉపాధి లేని నిరుద్యోగులు భవిష్యత్తు మీద భయంతో మత్తుపదార్థాలకు బానిసలైవుతున్నారని, అదే రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగానికి ప్రధాన కారణం మని ఆరోపించారు. తాను అధికారంలోకి లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని జగన్ ను ప్రశ్నించారు. డిగ్రీ, బీటెక్, ఇంటర్ చదివిని విధ్యార్థులు సైతం గంజాయి అమ్మూతు పట్టుపడుతున్నారంటే దానికి ప్రభుత్వమే భాద్యత వహించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, అత్యాచారాలకు, హత్యలకు డ్రగ్, లిక్కర్ మాఫియాల ప్రభావం ప్రధాన కారణాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో మహిళలపై దాడులు, అత్యాచారాలు రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిరోజులు ఎక్కడో చోట బాలికలు, మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై అత్యాచారం జరిగితే ఇంతవరకు నిందితుడిని పట్టుకోలేదంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అర్దమౌతోందన్నారు. ముఖ్యమంత్రి ఇకనైనా స్పందించి మహిళలకు రక్షణ కల్పించాలని, రాష్ట్రంలో మత్తు పదార్థాలను అరికట్టి యువత భవిష్యత్తు నాశనం కాకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comment here