Andhra PradeshEast GodavariNews

రక్తదానం.. ప్రాణదానంతో సమానం

రక్తదానం..ప్రాణదానంతో సమానం

ఫొటో : 28టిపిజి03 : రక్తదానం చేస్తున్న దృశ్యం…..
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : రక్తదానం ప్రాణదానంతో సమానమని బీజేపీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టా వంశీకృష్ణ అన్నారు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడీ జన్మదినోత్సవ సేవా ` సమర్పణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ మాట్లాడుతూ పనిచేసే కార్యకర్తలకు, సామాన్యులకు బీజేపీలోనే అత్యున్నత పదవులు లభిస్తున్నాయన్నారు. ప్రగతిలో యువతదే ప్రధాన పాత్ర అని వంశీకృష్ణ అన్నారు. బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు పాకా వెంకటసత్యనారాయణ మాట్లాడుతూ యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. బీజేపీ నర్సాపురం జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ మాట్లాడుతూ 20 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి, ఆరోపణలు లేని అరుదైన నేత ప్రధాని మోడీ అని కొనియాడారు. యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. బీజేవైఎం నర్సాపురం జిల్లా అధ్యక్షుడు ఆకుల లీలాకృష్ణ , రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోట రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా కార్యదర్శి యడ్లపల్లి శ్రీరామ్‌, మహిళామోర్చా పట్టణాధ్యక్షురాలు తాడాల సూర్యకుమారి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comment here