Andhra PradeshEast GodavariNews

రజక చైతన్య సభ

రజక చైతన్య సభ సంస్థ
కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జి గా భట్నవిల్లి నాగరాజు నియామకం..
కోస్తా ఎన్ కౌంటర్,కొత్తపేట; రావులపాలెం,మండలం పరిధిలోని కేతరాజుపల్లి గ్రామానికి చెందిన భట్నవిల్లి నాగరాజు రజక చైతన్య సభ సంస్థ కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జిగా నియమితులయ్యారు రజకులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మంగళవారం నాడు రాజమహేంద్రవరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సభ సంస్థ జిల్లా సమావేశంలో ఇంఛార్జిగా ప్రకటించారని పెద్దలు చేతులు మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నట్లు భట్నవిల్లి తెలిపారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఉన్న అన్ని గ్రామాల్లో కూడా రజకులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు తనకు ఈ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు గ్రంధం రవికుమార్,జిల్లా అధ్యక్షుడు గురాజాపు శ్రీనివాసరావు,సంఘం పెద్దలకు జిల్లా. రాష్ట్ర స్థాయి కార్యవర్గ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం పలువురు ప్రముఖులు యువకులు స్నేహితులు కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు నాగరాజును కలిసి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు

Comment here