Andhra PradeshEast GodavariNews

రాజరాజేశ్వరిగా చింతామణెమ్మ దర్శనం

రాజరాజేశ్వరిగా చింతామణెమ్మ దర్శనం
తాడేపల్లిగూడెం మండలం ముత్యాలంబపురం శ్రీముత్యాలమ్మ వారిని మహిషాసురమర్ధనిగా అలంకరించిన దృశ్యం……
రామచంద్రరావుపేట శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలోని చింతామణెమ్మవారిని రాజరాజేశ్వరిగా అలంకరించిన దృశ్యం……
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా పట్టణంలోని రామచంద్రరావుపేట శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో వేంచేసియున్న శ్రీచింతామణెమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా గురువారం అలంకరించారు. ఆలయ అర్చకులు మంగిపూడి సీతారామయ్య బ్రహ్మత్వంలో అమ్మవారికి సహస్ర, అష్టోత్తర పూజలను కామిశెట్టి గోపాలకృష్ణ ` సునీత, అంపుజాలపు నూకరాజు ` దుర్గాభవాని దంపతులు జరిపించారు. మందిర అధ్యక్ష, కార్యదర్శులు కొర్లేపర పాండురంగారావు, ఇందుకూరి మోహనరాజులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. మండలంలోని వీరంపాలెంలోని శ్రీబాలాత్రిపురసుందరీ పీఠంలోని అమ్మవారిని గురువారం మహాగౌరిగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంకుమార్చనలు, పుష్పార్చనలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షణలో అర్చకులు లలిత్‌కుమార్‌ పూజా కార్యక్రమాలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ముత్యాలంబపురం శ్రీముత్యాలమ్మవారిని మహిషాసురమర్ధనిగా అలంకరించారు. అమ్మవారికి చండీ హోమం, చండీ పారాయణలు నిర్వహించారు. సాయంత్రం పుష్పార్చన, సహస్రనామ కుంకుమ పూజలు జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్‌ మాకా బాలాజీ, ఆలయ మేనేజర్‌ సూర్యప్రకాశరావులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.

Comment here