Andhra PradeshEast GodavariNews

రాయవరం మండలం లో వైసిపి విజయభేరీ

*రాయవరం మండలం లో వైసిపి విజయభేరీ మోగించింది*

*16 ఎంపీటీసీ స్థానాలు జడ్పిటిసి స్థానం కైవసం*
*అన్ని రౌండ్లోనూ ఆధిక్యం కనపరిచిన వైసిపి అభ్యర్థులు…*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఓట్ల లెక్కింపు ప్రారంభించినప్పటి నుండి అన్ని రౌండ్లోనూ వైసిపి అభ్యర్థులు ఆధిక్యతను కొనసాగిస్తూ వచ్చారు. మండలంలో12 గ్రామాల్లో 19 ఎంపీటీసీ స్థానాలకు, ఒక జడ్పిటిసి స్థానానికి ఏప్రిల్ 8న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాలపై ఈనెల 19వ తేదీన ఓట్లను లెక్కించారు.19 ఎంపీటీసీ స్థానాల్లో 16 స్థానాలను వైసిపి కైవసం చేసుకుంది.నదురుబాదలో టిడిపి, వెదురుపాక లో 1,2 స్థానాల్లో వైసిపి, వి.సావరంలో వైసిపి, రాయవరం లో 1,2 వైసిపి, సోమేశ్వరం లో 1,2 వైసిపి, మాచవరం లో 1,2 వైసిపి, పసలపూడి లో 1,2 వైసిపి, చెల్లూరు లో 1 జనసేన, 2,3 స్థానాల్లో వైసిపి, వెంటూరులో 1,2 వైసిపి, కూర్మాపురం లో వైసిపి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.మండలంలో చిన్న గ్రామాలైన లొల్ల, నదురుబాద గ్రామాల్లో టిడిపి తన పరువు నిలబెట్టుకుంది. చెల్లూరు ఎమ్ పి టి సి ఒకటిని జనసేన పార్టీ కైవసం చేసుకొని మండలంలోతన ఖాతాను తెరిచింది. ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న రెండు మూడు చోట్ల జనసేన రెండో స్థానంలో నిలవగా ,టిడిపి మూడో స్థానానికి పడిపోయింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల మెజారిటీని అంచనా వేస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు ప్రజలు మద్దతుగా నిలిచారని వైసీపీ కేడర్ ఆనందం వ్యక్తం చేస్తోంది.
*ఎంపీపీ పీఠం ఎవరిది?*
  ఎంపీటీసీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి 19 స్థానాల్లో 16 స్థానాలను కైవసం చేసుకుని ఎంపీపీ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఆపీఠాన్ని అధిష్టించే ది ఎవరన్న ఆసక్తి ప్రజల్లో మొదలైంది. అధినాయకుని ఆశీస్సులు ఎవరికి లభిస్తాయో వారే ఎంపీపీ పీఠాన్నధిరోహిస్తారన్నది జగమెరిగిన సత్యం. మండల కేంద్రమైన రాయవరం ఎంపీటీసీ ఒకటవ స్థానం నుండి గెలుపొందిన నౌడు వెంకటరమణకు పార్టీ అధినాయకుడు ఆశీస్సులు ఎన్నికల ముందు నుంచే ఉన్నాయని ,వెంకటరమణనే ఎంపీపీ పీఠాన్నెక్కుతారని సర్వత్రా చర్చ సాగుతోంది. అధికారికంగా ఎంపీపీ ఎవరన్నది తెలియాలంటే ఈ నెల 24వ తేదీ వరకు వేచి ఉండక తప్పదు.
*జడ్పిటిసి ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించింది*
మండలంలో జడ్పిటిసి ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిని నల్లమిల్లి మంగతాయారు విజయకేతనం ఎగురవేశారు. ముగ్గురు అభ్యర్థులు పోటీ పోటీపడగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నల్లమిల్లి మంగతాయారు టిడిపి తరఫునకాద పద్మా బీజేపీ తరపున శాఖ రత్నావతి పోటీ చేశారు. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్య సాగింది. మంగతాయారు కు 21536 ఓట్లు రాగా ,కాద పద్మకు 9176 ఓట్లు, బీజేపీ అభ్యర్థిని శాఖ రత్నంకు 1340 ఓట్లు లభించాయి. మంగతాయారు 12360 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

Comment here