Andhra PradeshEast GodavariNews

*రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మల సంక్షేమానికి పెద్దపీట*

*రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మల సంక్షేమానికి పెద్దపీట*

*ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల సంక్షేమానికి పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి దేనని మండపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులన్నారు. శుక్రవారం మండలంలోని చెల్లూరు గ్రామంలో వైయస్సార్ రెండో విడత ఆసరా పథకాన్ని ఎమ్మెల్సీ తోట ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. మహిళలను అన్ని రంగాల్లో ను అగ్రభాగంలో నిలుపుతున్న ఘనత కూడా జగన్మోహనరెడ్డి దేనన్నారు. కరోనాతో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ మాటతప్పని మనిషి గా ముఖ్యమంత్రి అందరికీ ఆదర్శమయ్యారన్నారు. ఆసరా సొమ్మును మహిళలంతా సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆకాంక్షించారు. మండపేట ఏఎంసీ చైర్మన్ తేతల వనజా నవీన్ రెడ్డి, ఎంపీపీ నౌడు వెంకటరమణ, జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు, తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మహిళా పక్షపాతి గా అన్ని పదవుల్లోనూ మహిళలకే అగ్రతాంబూలం ఇచ్చారన్నారు. అనంతరం మండలంలోని 12 గ్రామాలకు చెందిన1479 సంఘాలకు 13 కోట్ల 71 లక్షా 32 వేల రూపాయల చెక్కులను తోట లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకులు కర్రి పాపారాయుడు, సత్తి వెంకటరెడ్డి ,వైసిపి ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ సిరిపురపు శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ గుమ్మడి చంద్రశేఖర్ ,మాజీ జెడ్ పి టి సి చిన్నంఅపర్ణ దేవి, సర్పంచులు పాలికి రాఘవా గోవిందు, ఆరిఫ్, వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,పార్టీ శ్రేణులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.

Comment here