Andhra PradeshEast GodavariNews

రాష్ట్రంలో దుష్టపాలనతో ప్రజలు అవస్థలు

రాష్ట్రంలో దుష్టపాలనతో ప్రజలు అవస్థలు

టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతులు నవీన్ ఆరోపణ
కోస్తా ఎన్కౌంటర్-తుని; రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన నుండి అన్నివర్గాల ప్రజలను వేధిస్తూ దుష్ట పాలన సాగుతోందని త్వరలోనే అపార్టీకి ప్రజలు చమరగితం పాడతారని టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతులు నవీన్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు  రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్ చార్జీలు పెరుగుదలపై  నియోజకవర్గ ఇంచార్జ్ యనమల కృష్ణుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు,కార్యకర్తలు తో నిరసన ప్రదర్శనలు జేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ పేదల బ్రతుకులుతో చెలగాటం ఆడుతూ నిత్యావసర ధరలు మొదలుకొని, విద్యుత్, పెట్రోల్, డీజిల్ ప్రతి దానిపై అపరిమిత సుంకలు విదిస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమైయ్యారని ఆరోపించారు. పెరిగిన విద్యుత్ చార్జీలను బేషరతుగా తగ్గించి 24గంటలు విద్యుత్ సరఫరా చెయ్యాలని డిమాండ్ జేశారు. రాష్ట్రంలో సంక్షేమం అంటూనే క్షమంన్ని సృష్టించిన ఘనత వైఎస్సార్ పార్టీకే దక్కుతుందని ఆరోపించారు. ఈకార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, మాజీ షుగరు ఫ్యాక్టరీ చైర్మన్ సుర్ల లోవరాజు,కోడా వెంకటరమణ, ఎస్సి సెల్ నాయకులు దిబ్బ శ్రీను,సాక రామకృష్ణ, కూరపాటి రఘు,మళ్ళీ గణేష్, చందక గురుమూర్తి,శ్రీనివాస్,సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comment here