Andhra PradeshEast GodavariNews

రాష్ట్రపతి పాలన విధించాలి

రాష్ట్రపతి పాలన విధించాలి
తాడేపల్లిగూడెంలో తీర్మాన పత్రాలను ఆవిష్కరిస్తున్న టీడీపీ నాయకులు…..

కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, రాష్ట్రపతి పాలనతో శాంతిభద్రతలను పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జీ అన్నారు. గురువారం స్థానిక తన కార్యాలయంలో టీడీపీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ శాంతిభద్రతలను పరిరక్షించడంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి విఫలమయ్యారని, కట్టడి చేయవలసిన పోలీసులను పక్కన పెట్టి తన కార్యకర్తలకు జగన్‌ అధికారమిచ్చారని దుయ్యబట్టారు. జడ్‌ కేటగిరి భద్రత మధ్య ఉండే చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిరచారు. రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌లను కోరుతూ ఈ మేరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలుగు రైతు నర్సాపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు పాతూరి రామ్‌ప్రసాద్‌ చౌదరి, గూడెం పట్టణ, మండల, పెంటపాడు మండల పార్టీ అధ్యక్షులు బడుగు వెంకటేశ్వరరావు, పరిమి రవికుమార్‌, కిలపర్తి వెంకట్రావు, నియోజకవర్గ ఎస్సీ సెల్‌, తెలుగు యువత అధ్యక్షుడు ముప్పిడి రమేష్‌, గంధం సతీష్‌, కండెల్లి సందీప్‌, తెలుగు రైతు నాయకుడు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కాగా, పట్టణ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడిగా శీలి వెంకటాచలం నియమిస్తూ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాబ్జీ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటాచలంను పట్టణ టీడీపీ అధ్యక్షుడు బడుగు వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ముప్పిడి రమేష్‌, పాతూరి రామ్‌ప్రసాద్‌ చౌదరి తదితరులు అభినందించారు.

Comment here