Andhra PradeshEast GodavariNews

రేషన్‌ బియ్యం పట్టివేత

రేషన్‌ బియ్యం పట్టివేత
పెంటపాడు మండలం అలంపురం వద్ద లారీలో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్న హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది……
కోస్తా ఎన్‌ కౌంటర్‌ పెంటపాడు : ఏలూరు నుంచి కాకినాడ పోర్టుకు లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని హైవే పెట్రోలింగ్‌ అధికారుల సహకారంతో రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వద్ద స్థానికుల సమాచారంతో ఏపీ 05 టీటీ 5982 నెంబరు గల లారీని అలంపురం వద్ద రెవెన్యూ అధికారుల సూచన మేరకు హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది నిలుపుదల చేశారు. రెవెన్యూ అధికారుల నుంచి లారీ డ్రైవర్‌ చింతా రాంబాబు పారిపోతుండగా పట్టుకున్నారు. ఏలూరుకు చెందిన రైస్‌ మిల్లర్‌ గొల్లపూడి రాంబాబు లారీగా అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. లారీలోని 11 టన్నుల రేషన్‌ బియ్యం ఉన్నట్టు రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాకినాడ పోర్టుకు వెళ్తున్నట్టు లారీ డ్రైవర్‌ చింతా రాంబాబు తెలిపారు. అనంతరం నిందితులపై 6(ఎ), 7(1) కేసు నమోదు చేయనున్నట్టు రెవెన్యూ, పోలీస్‌ అధికారులు తెలిపారు.

Comment here