Andhra PradeshEast GodavariNews

రైతులకు అండగా నిలుస్తాం…!

రైతులకు అండగా నిలుస్తాం…!
` టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జీ
తాడేపల్లిగూడెం మండలం నందమూరు గ్రామంలో ముంపునకు గురైన వరి చేలను పరిశీలిస్తున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల బాబ్జీ……..
కోస్తా ఎన్‌ కౌంటర్‌ తాడేపల్లిగూడెం : రైతాంగానికి అండగా నిలుస్తామని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ వలవల మల్లిఖార్జునరావు (బాబ్జీ) అన్నారు. బుధవారం మండలంలోని నందమూరు, నవాబ్‌పాలెం తదితర వరద ముంపు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీనికి తోడు పంట కాలువలు పూడుకుపోవడంతో వరద నీరు ఎగదన్ని పంట చేలను ముంచెత్తుతున్నాయన్నారు. పంట కాలువల్లో పూడిక తీయించాలన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట తెలుగు రైతు నర్సాపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు పాతూరి రామ్‌ప్రసాద్‌ చౌదరి, మండల పార్టీ అధ్యక్షుడు పరిమి రవికుమార్‌, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్‌ శనగన శ్రీనివాస్‌, సాధు శ్రీనివాస్‌, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్‌, నాయకులు పీతల సత్యనారాయణ, కొప్పినీటి వెంకటేశ్వరరావు, వాడపల్లి వెంకటసుబ్బరాజు తదితరులు ఉన్నారు.

Comment here