Andhra PradeshEast GodavariNews

రైతు పక్షపాతి ప్రభుత్వం వైసిపి

రైతు పక్షపాతి ప్రభుత్వం వైసిపి
 … కడుపు మంట బ్యాచ్ టీడీపీ మాజీ నాయకులు
… టిడిపి నాయకులు పండిస్తున్న గంజాయి పంటను సాగు చెయ్యడం కుదరదు
… టిడిపి నాయకులు లేఖలపై స్పందించిన రాష్ట్ర వ్యవసాయ  శాఖ మంత్రి కురసాల కన్నబాబు
కోస్తా ఎన్ కౌంటర్, సర్పవరం: రైతు భరోసా, పీఎం కిసాన్, నష్టపరిహారం, ఆర్ బి కే ద్వారా ఎరువులు ,విత్తనాలు  క్రాఫ్ ఇన్సూరెన్స్ లో మొదలగునవి రైతన్నల కోసం వ్యవస్థను బలోపేతం చేస్తున్న ప్రభుత్వం, రైతు పక్షపాతి నాయకుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. బుధవారం నాడు కాకినాడ రూరల్ మండలం లోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడు దేవినేని ఉమా ప్రభుత్వానికి రైతుల పట్ల లేఖలు రాశారని వాటిపై  మీడియా ప్రతినిధులు ఎదురుగా వాటికి సమాధానం చెప్పడం జరుగుతుందన్నారు. రైతన్న కోసం వ్యవస్థలను బలోపేతం చేసి తక్షణ సహాయం అందిస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. రైతు భరోసా పీఎం కిసాన్ కింద రైతులకు పంట సహాయం చేయడంతో పాటు తక్షణ పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతులకు చేస్తున్నా మేలును చూసి కడుపుమంటతో తెలుగుదేశం బ్యాచ్ లేనిపోని అవాకులు చవాకులు పేలడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టారని అధినాయకుడు ఎందుకు అడగలేదని ఇప్పుడు రైతు పక్షపాతి ప్రభుత్వం పై నిందలు వేయడం తగదన్నారు. రాష్ట్రంలో సాగుచేస్తున్న రైతులందరూ ప్రభుత్వంపై అసంతృప్తి తో ఉన్నారన్నారు. బ్యాచ్ ఆరోపణలలో అనంతపురం జిల్లాలో పది లక్షల పంటనష్టం జరిగిందని ఆరోపించడం జరిగిందన్నారు. వాటిలో ఎంతవరకు నిజం ఉందో నిరూపించుకోవాలి. కోస్తా జిల్లాల్లో క్రాఫ్ హాలిడే ప్రకటించారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కోనసీమ లో క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులను బెదిరించిన హోంమినిస్టర్ ఇలాంటి ప్రభుత్వం కాదని రైతులు క్రాప్ హాలిడే ప్రకటించకూడదని రైతులకు ఆదుకున్న ప్రభుత్వం మాదే అన్నారు. రైతులకు వ్యవసాయ మీటర్లను వేస్తే దాని మీద కూడా రాజకీయం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రైతు మీటర్ల పై బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకోవడం, వాటిపై రైతులతో సర్వే చేయగా 96 శాతం మంది ఈ విధానాన్ని సమర్థించారు. ఏడు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడం జరిగిందన్నారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులారా మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మీరు రైతులకు ఖర్చుపెట్టిన వివరాలు వెల్లడించారు. 2014- 15 గాను మొత్తం బడ్జెట్ లో 12 శాతం ఉండగా ఎన్నికల సమయంలో 10% తీసుకొచ్చిన ప్రభుత్వం మీద అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి బడ్జెట్లో 14 శాతం పెంచడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వరి సాగు ఎక్కువ 2014 -15 5580 కోట్లు దాన్యం కొనుగోలు చేస్తే, 2018- 19 12633 కోట్లు కొనుగోలు చేశామన్నారు. 2019- 20 లో  12730 కోట్లు దాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 2020- 21 లో  15487 కోట్లు  దాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇతర పంటలకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 2014 -15 గాను 402 కోట్లు  కొనుగోలు చేస్తే, 2018- 19 గాను 2595 కోట్లు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కోవేట్ సమయంలో బత్తాయి అరటి పళ్ళు రైతులు మార్కెట్ లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో లో మహిళా సంఘాల ద్వారా వాటిని ఇంటికి అమ్మకాలు జరిపి రైతులకు న్యాయం చేకూరేలా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. పువ్వులు ఎగుమతులు లేకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అనుసంధాన దేవాలయాలకు పువ్వుల ను అందించి తద్వారా  8 కోట్లు ఆదాయం చేకూరేలా చేశామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రాఫ్ ఇన్సూరెన్స్ లకు రైతులు నానా తంటాలు పడితే పట్టించుకోని ప్రభుత్వం నేడు క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ అందించిన ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఇన్సూరెన్స్ లో వివరాల్లోకి వెళితే 16- 17 సంవత్సరం లో 17 లక్షల 79 మందికి అందించడం జరిగిందని, 18 -19 సంవత్సరంలో 24 లక్షల 89 రైతులకు అందించడం జరిగిందన్నారు. 19 -20 సంవత్సరాలకు గాను 1 కోటి   2111 రైతులకు అందించడం జరిగిందన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులను పంపిణీ చేసిన ఘనత  వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దక్కుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను బ్యాంకులకు 688 కోట్లు విత్తనాలు బాకీ 385 కోట్లు ధాన్యం బాకీలు 2000 కోట్లు శనగ మొక్కజొన్న రైతులకు 93 కోట్లు బకాయిలు చెల్లించని ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. మీడియా సమావేశంలో కాకినాడ పార్లమెంటరీ సభ్యులు వంగా గీత, మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను , తదితరులు పాల్గొన్నారు.

Comment here