Andhra PradeshEast GodavariNews

రైతు భరోసా కేంద్రం కు శంకుస్థాపన

రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం దుళ్ల గ్రామంలో ఈ రోజు రైతు భరోసా కేంద్రం కు శంకుస్థాపన చేసిన రాజమండ్రి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్.
రైతుల సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు అని రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ తెలిపారు. కడియం మండలంలోని దుళ్ల గ్రామంలో రైతు భరోసా కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చందన నాగేశ్వర్ గారు మాట్లాడుతూ ఒక్కొక్క రైతు భరోసా కేంద్ర నిర్మాణానికి రూ 21 లక్షలు వెచ్చించనున్నట్లు, ఈ రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతులకు వ్యవసాయ ఆధారిత పనులను ఇటువంటి కేంద్రాల ద్వారా లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండపల్లి పట్టియ్య, కడియం మండల అధ్యక్షులు జేగురుపాడు సర్పంచ్ స్టాలిన్, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్, వార్డు సభ్యులు,  పంచాయతీ రాజ్ అధికారులు డి.ఈ ఏ.రవికుమార్ మరియు ఏ.ఈ త్రిమూర్తులు, పంచాయతీ సెక్రటరీ శిరీష, వైస్సార్సీపీ నాయుకులు తదితరులు పాల్గొన్నారు.

Comment here