Andhra PradeshEast GodavariNews

*లూధరన్ చర్చి లో ప్రజా ప్రతినిధులకు చిరు సత్కారం*

*లూధరన్ చర్చి లో ప్రజా ప్రతినిధులకు చిరు సత్కారం*
కోస్తా ఎన్ కౌంటర్ ప్రతినిధి ఆలమూరు:
మండల పరిధిలో జెడ్ పి టి సి , ఎం పీ పి,లుగా ప్రమాణ స్వీకారం చేసి, పదవులు చేపట్టిన ప్రజా ప్రతినిధులకు,చొప్పెళ్ల లూధరన్ సంఘము వారు సత్కారించారు.. ఆలమురు మండలం నుండి వై సి పి నుండి శాసన సభ్యులు చిర్ల జగ్గిరెడ్డి బలపరిచిన  జెడ్ పీ టీ సి అభ్యర్థి తోరాటి సీతామహాలక్ష్మీ రాంబాబు.ఇదే విదంగా ఎం.పీ. పి. అభ్యర్థిగా తోరాటి లక్ష్మణ్ రావు లు, ప్రజా ప్రతినిధులుగా గెలుపొంది,ప్రమాణస్వీకారం చేసిన ఇరువురు ఒకే గ్రామమునకు చెందినవారు కావడంతో,అదే గ్రామానికి
చెందిన గ్రామ సర్పంచ్ దంగేటి చంద్రకళ బాపనయ్యాలకు, వార్డ్ మెంబర్ సూర్యకుమారికి, గ్రామ ఆంధ్ర ఇవాంజికల్ లూధరన్ సంఘము
దైవజనులు రెవ. రంజిత్ కుమార్ ,సంఘ కాపరి అబ్రహం ప్రార్థన పూర్వకముగా వారిని ఆహ్వానించి,యూత్ వారు,సంఘస్తుల సమక్షంలో దుస్సాలువాలు కప్పి,పూల దండలతో సత్కరించి.ప్రత్యేక ప్రార్థనలు చేసి కార్యక్రమమును ముందుకు సాగించారు.ఈ కార్య క్రమములో యూత్ వారు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్లో న్నారు.

Comment here