Andhra PradeshEast GodavariNews

వలస కూలీలకు నిత్యావసర వస్తువుల పంపిణి…

వలస కూలీలకు నిత్యావసర వస్తువుల పంపిణి…

మహిళల భద్రత కోసం
ఆంధ్రప్రదేశ్ లో దిశ యాప్…

దేశ వ్యాప్తంగా జన్ సాహస్ టోల్ ఫ్రీ సేవలు…

జన్ సాహస్ స్వచ్చంద సంస్థను అభినందించిన

-రుడా ఛైర్మన్ మేడపాటి షర్మిళ రెడ్డి

కోస్త ఎన్ ఎన్కౌంటర్ , రాజమహేంద్రవరం సిటీ;
జన్ సాహస్ మరియు ప్రోగ్రాసివ్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా
రాజమండ్రి అర్బన్ లో 50 వలస కూలీల కుటుంబాలను గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి 2000 రూపాయల విలువైన,
15 రకాల నిత్యవసర వస్తువులను రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ మెడపాటి షర్మిల రెడ్డి మరియు జన్ సాహస్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రసాద్ పట్నాయక్ చేతుల మీదుగా
పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మేడపాటి షర్మిల రెడ్డి మాట్లాడుతూ వలస కూలీల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తూ వారికి కావలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పిస్తున్న జన్ సాహస్ సంస్థ ను అభినందించారు. వలస కూలీలు తనది కానీ రాష్ట్రం వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులలో జన్ సాహస్ వారు చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ లో దిశ యాప్ ఉందని, కానీ దేశ వ్యాప్తంగా జన్ సాహస్ టోల్ ఫ్రీ సేవలు ఉన్నాయని ఆ సేవలను వలస కూలీలు అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం నూతనంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇ- శ్రమ్ కార్డులను అందరూ నమోదు చేయించుకోవాలన్నారు. మున్ముందు జన్ సాహస్ హెల్త్ క్యాంప్ లు కూడా నిర్వహించాలని సూచించారు.
అందుకు గాను మా ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. రాజమండ్రి లోని జంగాల కాలనీ లో మీ సేవలు అందించాలని జన్ సాహస్ సంస్థ ప్రతినిధులను కోరారు.గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ కావూరి వరలక్మి
మాట్లాడుతూ కరోనా సమయం లో ఈ 200 కుటుంబాలను ఆదుకున్న జన్ సాహస్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
జన్ సాహస్ సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ ప్రసాద్ పట్నాయక్ మాట్లాడుతూ జన్ సాహస్ సంస్థ దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలలో 100 జిల్లా లలో వలస కూలీలా సామాజిక భద్రత కోసం కృషి చేస్తుందని, వలస కూలీలా సహాయం కోసం దేశ వ్యాప్తంగా టోల్ ఫ్రీ సేవలను 18002000211 ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు. మేము పంచె కర పత్రాలను అందరూ భద్ర పరుచు కోవాలని తెలిపారు.తమ సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వలస కూలీలకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తుందన్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం నూతనంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇ- శ్రమ్ కార్డులను అందరూ నమోదు చేయించుకోవాలన్నారు.కరోనా నేపథ్యంలో రెండు నెలల క్రితం 4 మండలాలలో 200 కుటుంబాలకు ఈ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామని, ఇప్పుడు రెండవ విడత లో భాగంగా మరో 4 మండలాలలో 200 కుటుంబాలను గుర్తించి వారికి నెల రోజులకు సరిపోయే వస్తువులను ఇవ్వడం జరుగుతుందన్నారు.సాహస్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని మంచి కార్య క్రమాలు ద్వారా సొసైటీలో ముందుకు తీసుకు వెళ్లాడానికి నిరంతరం కృషి చేస్తామని ప్రసాద్ పట్నాయక్ సభాముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఫీల్డ్ ఆఫీసర్ రాజా, ఆర్డినేటర్స్ సాయి వెంకట్,కావూరి సురేష్ కుమార్,కట్టుమూరి విజయ్ కుమార్, సత్తార్, సమీరా, జి.సునీల్, తదితర పాల్గొన్నారు.

Comment here