Andhra PradeshEast GodavariNews

*వార్డు అభివృద్ధి పై మేయర్ కి వినతి పత్రం*

*వార్డు అభివృద్ధి పై మేయర్ కి వినతి పత్రం*
*87వ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ ఆధ్వర్యంలో*

కోస్తా ఎన్కౌంటర్/ విశాఖపట్నం:
జీవీఎంసీ 87 వార్డు అభివృద్ధి కి కృషి చేయమంటూ వార్డు కార్పొరేటర్ బోండా జగన్ బుధవారం విశాఖపట్నం మేయర్ హరి వెంకట కుమారి కి వినతి పత్రం అందజేశారు. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం, శ్మశానవాటిక కి ఆనుకొని ఉన్న రహదారి, సిద్దార్ద్ నగర్ పంప్ హౌస్ కి వెళ్ళే రోడ్డు, నిర్వాసిత కాలనీ లో ఉన్న ప్రధాన కాలువ (గెడ్డ )కి ఇరువైపులా సపోర్ట్ వాల్ నిర్మాణం, వడ్లపూడి బస్సు స్టాప్ నుండి నుండి కణితి కూడలి గాంధీ బొమ్మ వరకు వెళ్ళే ప్రధాన రహదారి , ఎన్టీఆర్ కాలనీ ప్రధాన కాలువ అభివృద్ధి, తిరుమల నగర్, శివాజీ నగర్, పాత వడ్లపూడి లో నూతన రోడ్లు వేయటకు, లక్ష్మీపురం, దుగ్గపు వానిపాలెం లో కాలువలు, కల్వర్టులు,వేయుటకు నిధులు కేటాయించి వార్డు అభివృద్ధి కి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు పీలా శ్రీనివాస్, గంధం శ్రీను, పల్ల శ్రీను, రౌతు శ్రీను, దళ్లి గోవింద పాల్గొన్నారు

Comment here