Andhra PradeshEast GodavariNews

*వాలంటీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం*

*వాలంటీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మండలంలోని పలు గ్రామ సచివాలయాల పరిధిలో ఖాళీగా ఉన్న 14 వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో మల్లపురెడ్డి శ్రీను మంగళవారం విలేకరులకు తెలిపారు. మండలంలోని చెల్లూరులో- 4 , కురకాళ్ల పల్లిలో -3 , నదురుబాదలో-1, సోమేశ్వరం లో-2,వి.సావరంలో-1, వెదురుపాకలో-2,వెంటూరులో-1, పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదవ తరగతి పాసై, 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి 3వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, సంబంధిత ప్రతులను ఆయా గ్రామ సచివాలయ కార్యదర్శి లకు అందజేయాలని ఎంపీడీవో తెలిపారు.

Comment here