Andhra Pradesh

విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరునితోనే ఆటలా

ఆంక్షలు తొలగించాలని
ఇంచార్జి తహశీల్దార్  గోపాలరావుకి వినతపత్రాన్ని అందజేసి
 రావులపాలెం బీజేపీ నేతలు..
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరునితోనే ఆటలా
 చవితి పండుగ ఉత్సవాలపై వైసీపీ సర్కార్ తీరుమార్చుకోవాలి
జగన్ హిందూ మతంపై కుట్ర రాజకీయాలు చేయ్యద్దు
కోస్తా ఎన్ కౌంటర్ రావులపాలెం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హిందూ మతం పైన సనాతన ధర్మంపైన అణిచివేతకోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నారని  భారతీయ సాంప్రదాయం పద్దతిలో  జరిగే హిందు పండుగలపై ప్రతీ సారి కక్ష పూరితంగా వ్యవహరించడం చాలా దారుణంగా ఉందని
బీజేపీ నేతలు మండిపడుతున్నారు వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు విధించడంపై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరియు అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మానేపల్లి అయ్యోజీ వేమాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఉదయం రావులపాలెంలో  మహిళా మోర్చా అమలాపురం పార్లమెంట్ జిల్లా  అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఎంతో భక్తి శ్రద్ధలతో సమస్త లోకమంతా జరుపుకునే హిందు పండుగ గణపతి నవరాత్రులకు ఆంక్షలు విధించవద్దని స్థానిక మండల రెవిన్యూ కార్యాలయం వద్ద సూపర్ డెంట్. ఇంచార్జి తహశీల్దార్ .జి. గోపాలరావుకి వినతపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ హిందూ పండుగలపై కావాలనే ఏపీ సీఎం జగన్ రాద్దాంతం చేస్తు అడ్డుకుంటు హిందువు ప్రజల మనోభావాలను దెబ్బతిస్తున్నారన్నారు ఓటు బ్యాంకు కోసం భగవంతుడితో రాజకీయాలు చెయ్యొద్దని విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరునితో ఆటలాడుకుంటే భవిష్యత్తు శూన్యం అవుతుందన్నారు ప్రజలు ఏ పని శుభకార్యాలు మొదలెట్టిన వినాయకుడి పూజతో మొదలు పెడతారని ప్రజలంతా పూజించే అటువంటి వినాయక చవితి పండుగపై ఆంక్షలు విధించడం మంచిదికాదని హితవు పలికారు వైసీపీ పార్టీ చేస్తున్న కార్యక్రమాలుకు సమావేశాలకు
లేని ఆంక్షలు అడ్డంకులు మా హిందూ పండుగలపై మీ పెట్టనమేంటని జగన్మోహన్ రెడ్డి సర్కారుని ప్రశ్నించారు హిందు పండుగల కోసం బొమ్మలు తయారు చేసుకుని జీవించే వృత్తి దారుల పొట్టకొట్టేశారని వారి ఉసురు తగిలి తిరుతందన్నారు ఎన్నో ఏళ్ళు నుండి వినాయక చవితి ఉత్సవాల కోసం జీవనదారంగా ప్రతి ఏటా లక్షలు లక్షలు అప్పులు చేసి ఏడాది పొడవునా కుటుంబమంతా బొమ్మలు చేసుకుంటూ అమ్ముకుని జీవించే మాకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోవిడ్ నిబంధనలు సాకుతో చవితి పండుగ ఉత్సవాలపై ఆంక్షలు విధించడంతో మాకు జీవనాధారం దెబ్బతీశారని విగ్రహాలు నిలిచిపోయి అప్పులు పాలై పీకల్లోతు కష్టాల్లో పడ్డామని బొమ్మల తయారుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నేత.అమలాపురం పార్లమెంట్ యస్ సి మోర్చా జిల్లా ప్రధానకార్యదర్శి పోనుగుపాటి శ్రీనివాస్ ,బీజేపీ నేతలు గండ్రోతు వీరగోవిందరావు,మద్ధింశెట్టి శ్రీనివాస్ ,కొవ్వూరి సీతారామిరెడ్డి,మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు తలారి లలిత,నందం రవితేజ,విజయ్ కుమార్,పి.నవీన్, సిహెచ్ మౌళి,ఎ .అక్షయ్, ఎమ్. రాజు, పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

Comment here