Andhra PradeshEast GodavariNews

విజయదుర్గా పీఠంలో ఈనెల 7నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు

*విజయదుర్గా పీఠంలో ఈనెల 7నుండి శరన్నవరాత్రి ఉత్సవాలు*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో50వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈనెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అడ్మినిస్ట్రేటర్ వి వి బాపిరాజు ,పి ఆర్ ఓ వాడ్రేవు వేణుగోపాల్ ( బాబి) తెలిపారు. పీఠం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ 7వ తేదీ ఉదయం 8:26 లకు కలశ స్థాపనతో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. తొలిరోజు విజయ దుర్గ అమ్మవారు రజత కవచ అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారన్నారు.8న బాలా త్రిపుర సుందరి దేవి, 9న గాయత్రీదేవి, 10న లలితా త్రిపుర సుందరి, 11న అన్నపూర్ణాదేవి ,12న మహాలక్ష్మీదేవి, 13న సరస్వతీదేవి ,14న మహిషాసురమర్దని ,విజయ దుర్గా దేవి ,15న రాజరాజేశ్వరీ దేవిగా అలంకరింపబడి అమ్మవారి పూజలందుకుంటారన్నారు. అమ్మవారికి జరిగే పూజలు, సేవలు ఏకాంతంగా జరుగుతాయని తెలిపారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో విజయ దుర్గ సేవా సమితి సభ్యులు జి. సత్య వెంకట కామేశ్వరి, పి .సత్య కనకదుర్గ, జి. రమ్య ,జి భాస్కర నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comment here