Andhra PradeshEast GodavariNews

*విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యం*

*విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యం*

*ఎంపీపీ నౌడు వెంకటరమణ*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* ప్రతి ఒక్కరూ విద్యావంతులైన అప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీపీ నౌడు వెంకటరమణ పేర్కొన్నారు. పదవి చేపట్టిన అనంతరం తొలిసారిగా మండలంలోని వి.సావరం గ్రామంలో మండల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విద్యారంగంలో వినూత్నమైన మార్పుకు శ్రీకారం చుట్టారన్నారు. నాడు-నేడు పథకం ద్వారా ప్రతి పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఆధునీకరించి, విద్యార్థుల అవసరాలకు తగిన వసతులు కల్పిస్తున్నారన్నారు.ఆయన అడుగుజాడల్లో తాము కూడా నడుచుకుంటూ విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. మధ్యాహ్న భోజన పథకం లో ఆహార పదార్థాల నాణ్యతను ఎంపీపీ పరిశీలించారు .విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందుతుందా లేదా అని ఆరా తీశారు. పాఠశాల, పరిసరాలు శుభ్రతపై హెచ్ ఎం శ్రీనివాస్ కు, పలు సూచనలు చేశారు. ఎంపీపీ వెంట గ్రామ సర్పంచ్ కాకి కృష్ణవేణి కోటేశ్వరరావు, ఉప సర్పంచ్ వెలగల సత్యనారాయణ రెడ్డి, ఎంపిటిసి సభ్యురాలు మేడిశెట్టి నాగమణి, సొసైటీ అధ్యక్షుడు సిరికి కృష్ణారావు, పి ఎం సి చైర్మన్ గుడాల శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి అత్తిలి గోవిందరాజు ఉన్నారు.

Comment here