Andhra PradeshEast GodavariNews

*విద్యార్థుల ఉన్నతికి దాతల సహకారం ప్రశంసనీయం*

*విద్యార్థుల ఉన్నతికి దాతల సహకారం ప్రశంసనీయం*

*రామచంద్రపురం డిఎస్పి బాలచంద్రారెడ్డి*
*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం*:*విద్యార్థుల ఉన్నతికి దాతల సహకారం ప్రశంసనీయమని రామచంద్రపురం డిఎస్పి ఎం. బాలచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పసలపూడి గ్రామంలో కొవ్వూరి బసివి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైతన్య రాజబాబు సౌజన్యంతో వివిధ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రామచంద్రపురం డిఎస్పి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తాతగారైన బసివి రెడ్డి స్ఫూర్తితో ఆయన మనవడు చైతన్య రాజబాబు గత 22 సంవత్సరాలుగా విద్యార్థులకు అందజేస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో దాతలు విద్యార్థులకు తన వంతు సహకారం అందజేయాలని  విజ్ఞప్తి చేశారు. అనంతరం పసలపూడి మెయిన్, న్యూ కాలనీ, చింతల తోట, కృష్ణమ్మ చెరువు, నరాల పాలెం ,తదితర పాఠశాలల్లో చదువుతున్న సుమారు 500 మంది విద్యార్థులకు సుమారు 70 వేల రూపాయలు విలువగల8 వేల పుస్తకాలను డిఎస్పి తదితర అతిథులు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సతీమణి అఖిల,ఎస్ ఐ పి .వి ఎస్ ఎస్ ఎన్ సురేష్, ఎస్ బి ఐ మేనేజర్ భాస్కర్ రావు, కె పి ఆర్ హెచరీస్ అధినేత చింతా కృష్ణారెడ్డి, పారిశ్రామికవేత్త పోతంశెట్టి శ్రీనివాస రెడ్డి, ప్రగతి రామారెడ్డి, పి రామ రాజా రెడ్డి,వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comment here