Andhra PradeshEast GodavariNews

విద్యా,విజ్ఞానం పెంపోందించేందుకు స్వేరోస్ సంస్థ  కృషి చేస్తుంది

విద్యా,విజ్ఞానం పెంపోందించేందుకు స్వేరోస్ సంస్థ  కృషి చేస్తుంది……ఆర్.రాజశేఖర్ (స్వేరోస్ విజన్ ఇంట్రనేషనల్ రాష్ట్ర అధ్యక్షులు )…..
కోస్తా ఎన్కౌంటర్ (తణుకు)….. దళితులకు విద్యా, విజ్ఞానం పెంపొందించేందుకు స్వేరోస్ సంస్థ కృషి చేస్తుందని స్వేరోస్ విజన్ ఇంటర్నేషనల్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్. రాజశేఖర్ చెప్పారు.స్థానిక అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన స్వేరోస్ జిల్లా స్థాయి సమావేశానికి  ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జోనల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కొడమంచిలి ఆనందకుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ విజన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన పలు విద్యా, విజ్ఞాన సంబంధమైన విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి యేజెర్ల శ్రీనివాసరావు,ఎమ్మార్పిఎస్ నాయకులు అబ్బ దాసరి లాజర్, దిద్దే మధుబాబు, కారుమంచి మిత్ర, చెట్టే సుజనరావు , కొండేటి శివ, ఏజెర్ల శ్రీనివాస్, కంకిపాటి చిన వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Comment here