Andhra PradeshEast GodavariNews

వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాల్సిందే 

వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాల్సిందే

 కోస్తాఎన్ కౌంటర్ రామచంద్రపురం : భారతీయ జనతాపార్టీ రామచంద్రపురం పట్టణంలో ఆదివారం అత్యవసర సమావేశం టౌన్ అధ్యక్షులు యండ్ర బుల్లి అబ్బులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఇళ్ళ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలు బహిరంగ వేదికలపై నిర్వహించడానికి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం  ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లా ఎస్సీ మోర్చ అధ్యక్షులు పలివేల రాజు మాట్లాడుతూ కరోనా పేరుతో వినాయక చవితి పండుగను వ్యక్తిగతంగా చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో నిర్ణయించడం ద్వారా మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బ తీయడమే అవుతుందని ఆయన ఆవేదన  వ్యక్తం చేశారు. ధార్మిక సంఘ కన్వీనర్ సత్యవాడ శ్రీహరి పంతులు మాట్లాడుతూ  కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించవచ్చు. బహిరంగ  సభలను కూడా నిర్వహించవచ్చు. వ్యాపార వాణిజ్య సముదాయాలు సినిమా హాలు తెరవవచ్చు. కానీ వినాయక చవితి వేడుకలకు మాత్రం కరోనా అడ్డంకిగా కనబడుతుందా అని విమర్శించారు. ట్రేడర్స్ సెల్ కన్వీనర్ కొట్టువాడ హరిబాబు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలను వేడుకగా రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో జరిపిన వైసీపీ ప్రభుత్వం వినాయక చవితిని  అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణాల కాశీవిశ్వనాథం, ఖండవిల్లి సుందర్ సింగ్, ఖండవిల్లి సత్యనారాయణ, వింజరపు రామకృష్ణ మొదలగు నాయకులు పాల్గొన్నారు.

Comment here