Andhra PradeshEast GodavariNews

వృద్ధుల పట్ల మంచి హృదయంతో స్పందించాలి.

వృద్ధుల పట్ల మంచి హృదయంతో స్పందించాలి.

కోస్తా ఎన్ కౌంటర్ ఏలూరు. వృద్ధులు పెద్దవారు పట్ల ప్రతి ఒక్కరూ మంచి హృదయంతో మానవత్వంతో స్పందించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల రమేష్ అన్నారు .ఈ సందర్భంగా కండ్రిక గూడెం రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలికి దగ్గర ఉండి భోజనం తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన తర్వాత శిలా విగ్రహాలు పెట్టడం కంటే బతికుండగా వృద్ధులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, ఏమీ సంబంధం లేకపోయినా మానవత్వంతో స్పందించి ప్రతి ఒక్కరూ వారికి కడుపునిండా అన్నం పెడితే చాలు అని ఆయన తెలిపారు.

Comment here