Andhra PradeshEast GodavariNews

*వెంటూరు గ్రామ సచివాలయంలో చోరీ*

*వెంటూరు గ్రామ సచివాలయంలో చోరీ*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం*: మండలంలోనివెంటూరు గ్రామ సచివాలయం- 1 లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి దేశాల శ్రీనివాసరావు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏ ఎస్ ఐ పి .వెంకటేశ్వరరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఏ ఎస్ ఐ ఘటన వివరాలను విలేఖర్లకు వెల్లడిస్తూ గుర్తుతెలియని దుండగులు సచివాలయ తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి కలర్ ప్రింటర్, బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్, 3 జియో డేటా కార్డులు చోరీకి గురైనట్లు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రామచంద్రపురం సబ్ డివిజన్ క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించి నట్లు తెలిపారు. ఏ ఎస్ ఐ వెంట అసిస్టెంట్ రైటర్ రొక్కల శ్రీను, కానిస్టేబుల్ పలివెల రాజు తదితర సిబ్బంది ఉన్నారు.

Comment here