Andhra PradeshEast GodavariNews

వేలేరుపాడు జెడ్పీటీసీ వైఎస్సార్ సీపీ కైవసం

వేలేరుపాడు జెడ్పీటీసీ వైఎస్సార్ సీపీ కైవసం

– 7 ఎంపీటీసీ స్థానాలకు 4 వైఎస్సార్ సీపీ,3 సీపీఐ ఎంఎల్ విజయం
– మండలంలో వైసీపీ, సీపీఐ ఎంఎల్ అభ్యర్థులే గెలుపు
– ప్రతిపక్ష టీడీపీ ఒక్క అభ్యర్ధి కూడా గెలువని పరిస్థితి
కోస్తా ఎన్ కౌంటర్ వేలేరుపాడు: మండలంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏప్రియల్ 8 వ తేదీన జరిగిన విషయం విదితమే.ఎట్టకేలకు ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో వేలేరుపాడు లో జెడ్పీటీసీ అభ్యర్ధి గుజ్జా.రామలక్ష్మి గెలుపొందారు.ఎంపీటీసీ 7 స్థానాలకు 4 స్థానాలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది.3 స్థానాలు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ విజయ కేతనం ఎగుర వేశారు.అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఓట్ల లెక్కింపు మండలంలో వైఎస్సార్ సీపీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ దక్కించుకున్నాయి.వేలేరుపాడు మండల జెడ్పీటీసీ గా గూజ్జా రామలక్ష్మి వైసీపీ గెలుపొందారు.ఎంపీటీసీ 7 స్థానాలకు గాను రేపక గొమ్ము కేసగని.వేంకటేశ్వరమ్మ (వైఎస్సార్ సీపీ) తాట్కురి గొమ్ము కొమర్రాజు. రాంబాబు (వైఎస్సార్ సీపీ) భూదేవి పేట మేడ వరపు నాగలక్ష్మి (వైఎస్సార్ సీపీ) కట్కురు వాళ్ళ.లక్ష్మి దేవి (వైఎస్సార్ సీపీ) రామవరం సోయాం. చందర్రవూ (సీపీఐ ఎంఎల్)మేడిపల్లి తూర్రం.తమ్మయ్య (సీపీఐ ఎంఎల్) నల్లవ రం కట్టమ్.రత్తమ్మ (సీపీఐ ఎంఎల్) గెలుపొందారు.4 ఎంపీటీసీ స్థానాలు గెలిచిన వైఎస్సార్ సీపీ కి మండల పరిషత్ ప్రెసిడెంట్ పూర్తి అవకాశం ఉంది.
వైఎస్సార్ సీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలు,పథకాలు గెలిపించి నవి అని అన్నారు.ఇంతటి విజయాన్ని అందించిన మండల ప్రజలకు మండల నాయకులు కేసాగన్.శ్రీనివాస గౌడ్,కామినేని.వేంకటేశ్వర రావు, గుద్దెటి.భాస్కర్ అభినందనలు తెలిపారు. విరివేంట కే.సత్తిరాజు,దొరబాబు,చిన్ని,ప్రేమ్ కుమార్,చక్రి,కొమర్రాజు.శివ,జొన్నలు.ఎల్లేశ్వరారావు, సౌకతు,రహీం,వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల పార్టీ నాయకులు గౌస్,లక్ష్మయ్య మండలంలో 3 ఎంపీటీసీ స్థానాలు గెలుపొంది నామని ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు ప్రతి ఒక్కరికీ విప్లవా బి వందనాలు తెలిపారు.నాయకులు జి.ముత్యాలరావు,యస్.రామారావు, కె.ముత్యలరావు,వీరాస్వామి పాల్గొన్నారు. టిడిపి అంతర్గత కలహాలతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానం కూడా గెలుపొం ద పోవడం గమనార్హం.

Comment here