Andhra PradeshEast GodavariNews

వైస్ ఎంపీపీ ఏకగ్రీవ ఎన్నిక.

వైస్ ఎంపీపీ ఏకగ్రీవ ఎన్నిక.

కోస్తా ఎన్ కౌంటర్ టి నరసాపురం. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు గా బుర్ల దివ్యభారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని ఆర్వో వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటలకు వైస్ ఎంపీపీ పదవి కోసం ఎంపీటీసీ ల నుండి ఒక నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు, ఎంపీడీవో కేపీ కామేశ్వరి, టీ నర్సాపురం సొసైటీ అధ్యక్షులు దేవరపల్లి ముత్తయ్య, మండల అధ్యక్షుడు శ్రీను రాజు, మక్కినవారిగూడెం సొసైటీ అధ్యక్షులు పిన్నమనేని చక్రవర్తి, దేవరపల్లి సీతారాం ప్రసాద్, కటకం మల్లయ్య, కె సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Comment here