Andhra PradeshEast GodavariNews

వై వి సుబ్బారెడ్డిని కలిసిన మాగాపు

వై వి సుబ్బారెడ్డిని కలిసిన మాగాపు
కోస్తాఎన్ కౌంటర్ రామచంద్రపురం:  మండపేట నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రి శంకుస్థాపన నిమిత్తం వచ్చిన ఉదయ గోదావరి జిల్లాల వైకాపా రీజినల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డిని రామచంద్రపురం నియోజకవర్గ వైకాపా సీనియర్ నాయకులు న్యాయవాది మాగాపు అమ్మిరాజు కలిసి వినతి పత్రం అందజేశారు. వై ఎస్ ఆర్ సి పి పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్యకర్తల మనోభావాలను వ్యక్తీకరిస్తూ అందజేసిన వినతిపత్రానికి సానుకూలంగా స్పందించిన వై.వి.సుబ్బారెడ్డి పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త మనోభావాలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అన్నారు.అంతేకాక  విజయదశమి అనంతరం ప్రతి కార్యకర్తతో ముఖా ముఖి మాట్లాడటానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్టు  మాగాపు అమ్మిరాజు తెలియజేశారు. నియోజకవర్గంలో పార్టీ కోసం పాటుపడి మరుగునపడిన ప్రతి కార్యకర్త విజయదశమి తర్వాత సుబ్బా రెడ్డి గారిని కలవడానికి సమాయత్తం కావాలని భవిష్యత్ 2024లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి గా చూడటమే అంతిమ లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అమ్మిరాజు కోరారు.

Comment here