Andhra PradeshEast GodavariNews

వ్యవసాయంలో నూతన ఆధునిక పద్ధతులు పాటించాలి

వ్యవసాయంలో నూతన ఆధునిక పద్ధతులు పాటించాలి. ఏ ఓ ముత్యాలరావు.

కోస్తా ఎన్ కౌంటర్ టీ నర్సాపురం. పశ్చిమ గోదావరి జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించినట్లు వ్యవసాయ అధికారి ముత్యాల రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలంబడి సందర్శించిన రైతులకు వ్యవసాయ పద్ధతుల గురించి సూచనలు ఇచ్చారు. ప్రతి రైతు వ్యవసాయంలో నూతన సాంకేతిక పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండటం వల్ల అగ్గి తెగులు, పొడ తెగులు ఇలాంటివి సోకితే పెకట కొనాజూల్ ముందు 200 మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయకుడు శ్రీ కన్య, నూకరత్నం మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Comment here