Andhra PradeshEast GodavariNews

శ్రీ చైతన్యలో  వైభవంగా  దసరా ఉత్సవాలు

శ్రీ చైతన్యలో  వైభవంగా  దసరా ఉత్సవాలు
కోస్తాఎన్ కౌంటర్, రామచంద్రపురం : స్థానిక  శ్రీ చైతన్య పాఠశాలలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని   శుక్రవారం  దసరా వేడుకలు   అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో దుర్గామాతకు పూజలు నిర్వహించారు. పాఠశాల   ప్రిన్సిపాల్ రామ్ కుమార్ మాట్లాడుతూ నవరాత్రులలో  దుర్గా మాత శక్తి సామర్థ్యాలను, గొప్పదనాన్ని విద్యార్థులకు వివరించారు. అంతేకాక జగన్మాత దుర్గాదేవిపై నమ్మకం ఉంచినట్లైతే మానవాళిని సదా సుఖ సంతోషాలతో ఉండేలా చేస్తుందని తెలిపారు.  అనంతరం  ఓటి లో ఉత్తమ ప్రతిభను చాటిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. చిన్నారులు దుర్గామాత వేషధారణ లోనూ, వివిధ  సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. పూజ అనంతరం ప్రసాద పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ నాగేశ్వరరావు, ప్రాధమిక పాఠశాల ఇన్ చార్జ్ శ్రీ వల్లి,  ఉపాధ్యాయ బృందం,  సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comment here