Andhra PradeshEast GodavariNews

శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా శరన్నవరాత్రి పూజలు

శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా శరన్నవరాత్రి పూజలు
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : పెదబ్రహ్మదేవం గ్రామంలో గల శ్రీశారదా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుగుతున్నాయి. నాల్గవరోజు పూజలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కీ.శే.తోటకూర సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.ఏకవార రుద్రాభిషేకం అష్టోత్తర శతనామావళి నీరాజన మంత్ర పుష్పాలు,లలిత సహస్ర నామాలతో కుంకుమార్చన,ఆరాత్రికం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పూర్తి  భక్తి శ్రద్ధలతో జరిగాయి.ఈ కార్యక్రమాలలో తోటకూర సాయిరామకృష్ణ సోదరులు వారి కుటుంబ సభ్యులు,సమితి గౌరవ అధ్యక్షులు వింజమూరి సుబ్రహ్మణ్యశర్మ, కార్యదర్శి వింజమూరి విశ్వనాధం,సభ్యులు నువ్వుల వెంకట్రాజు,బాబ్జి,పెంటపాటి మల్లిఖార్జునరావు,భక్తులు పాల్గొన్నారు.

Comment here