Andhra PradeshEast GodavariNews

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన వీసీ జగన్నాథరావు

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన వీసీ జగన్నాథరావు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మొక్కా జగన్నాథరావు మర్యాదపూర్వకంగా కలిసారు. అమరావతి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పుచ్చగుచ్చానిచ్చి అభినందలు తెలియజేసారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను వీసీ వివరించారు. విశ్వవిద్యాలయానికి ఐ.ఎస్.ఓ., ఎ.ఐ.సి.టి.ఈ. గుర్తింపును తీసుకువచ్చామని ఈ ఏడాదిలోనే నాక్ గుర్తింపును తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలియజేసారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులలో విజ్ఞానాన్ని నింపేందుకు వెబినార్లు నిర్వహించామని, తెలుగు రాష్ట్రాలలోనే 100కు పైగా వెబినార్లు నిర్వహించి తొలి స్థానంలో ఉన్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి దిశ యాప్ ఆవిష్కరణ విశ్వవిద్యాలయంలోనే జరిగిందని ప్రభుత్వ ప్రోత్సాహంతో సమాజహితమైన మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీసీ తెలిపారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ అభివృద్ధికి ప్రభుత్వం నుండి తమవంతు సహాయ సహకారాలను అందిస్తానని సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేసారన్నారు.

Comment here