Andhra PradeshEast GodavariNews

సత్య శోధక్ సమాజ్ వారోత్సవాలలో మొక్కలు నాటిన కార్యకర్తలు 

సత్య శోధక్ సమాజ్ వారోత్సవాలలో మొక్కలు నాటిన కార్యకర్తలు

కోస్తాఎన్ కౌంటర్ రామచంద్రపురం : సామాజిక  తత్వవేత్త సమన్యాయం,సత్య శోధకుడు జ్యోతి రావు పూలే అని యాట్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన దార్మనీకుడు.మహాత్మ జ్యోతిరావు పూలే అని నియోజకవర్గం బీసీ సేన అధ్యక్షుడు యాట్ల నాగేశ్వరరావు అన్నారు.సత్యశోధక్ సమాజ్ వారోత్సవాలలో భాగంగా ఐదవ రోజును పురస్కరించుకుని మంగళవారం ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ కొరకు ద్రాక్షారామంలో వివిధ ప్రాంతాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. యాట్ల మాట్లాడుతూ కాలుష్యం నివారణ కొరకు ప్రతి ఒక్కరు తమ గృహాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంపల వెంకట సోమరాజు, మేడిసెట్టి శ్రీనివాసు పాల్గొన్నారు.

Comment here