Andhra PradeshEast GodavariNews

సర్పంచ్ కుటుంబం నుంచి రక్షణ కల్పించాలి

సర్పంచ్ కుటుంబం నుంచి రక్షణ కల్పించాలి

మురమండ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఏలూరి దుర్గాప్రసాద్  ఆవేదన
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్

కడియం ( రూరల్ మురమండ ) :

మురమండ గ్రామ సర్పంచ్ అయినవెల్లి రుక్మిణీ, ఆమె భర్త అయినవెల్లి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు అయినవెల్లి పాపయ్య, బలుగూరు గోవింద్ ల నుంచి తనకు ప్రాణహాని ఉందని మురమండ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఏలూరి దుర్గా ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మురమండ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు వివాహం అయిందని, తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న తాను మురమండ గ్రామ వార్డు మెంబర్ గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించినట్లు తెలిపారు. తమ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన కుమార్తె 6వ తరగతి చదువుతుందని తెలిపారు. పాఠశాల విద్యామండలి సమావేశంలో పాల్గోనేందుకు  సెప్టెంబర్ 22వ తేదీ న పాఠశాల కు వెళ్ళగా అప్పటికే అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ భర్త అయినవెల్లి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు అయినవెల్లి పాపయ్య, బలుగూరి గోవింద్, తనపై దాడి చేసి దుర్బాషలాడి పాఠశాల నుంచి బయటకు గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనితో పాటు నాపై కడియం పోలీస్ స్టేషన్ లో తిరిగి ఫిర్యాదు చేశారని అన్నారు. ఆదివారం పోలీసులు తనను పోలీస్టేషన్ కు తీసుకు వెళ్లి సాయంత్రం వరకు స్టేషన్ లో కూర్చోబెట్టి రాత్రి ఇంటికి పంపించారని అన్నారు. తన ఫిర్యాదు ను పరిగణనలోకి తీసుకోకుండా సర్పంచ్ భర్త ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించి తనను వేధింపులకు గురి చేస్తున్నరని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్న సర్పంచ్ కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని తనకు , కుటుంబానికీ రక్షణ కల్ఫించాలని కోరారు.

Comment here