Andhra PradeshEast GodavariNews

సర్పంచ్ రామ తులసి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ తోట

కోస్తాఎన్ కౌంటర్,కపిలేశ్వరపురం:మాతృ వియోగంతో బాధపడుతున్న వెదురుమూడి సర్పంచ్ చోడే రామ తులసి కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పరామర్శించారు.రామ తులసి తల్లి మాజీ సర్పంచ్ గజ్జరపు రత్న మాణిక్యాంబ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు.భర్త వీర్రాజును  పరామర్శించి ఆమె మృతికి సంతాపం తెలిపారు.రత్న మాణిక్యాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.మాణిక్యాంబ సర్పంచ్ గా గ్రామ అభివృద్ధికి కృషి చేసి ప్రజల మన్ననలు పొందారన్నారు.పరామర్శించిన వారిలో ఎమ్మెల్సీ త్రిమూర్తులతో పాటు కపిలేశ్వరపురం మండల పరిషత్ ఉపాధ్యక్షులు జి.భానుప్రసాద్, వైసిపి నాయకులు పుట్టా కృష్ణమూర్తి,ముత్యాల రామారావు,చేబ్రోలు వీరభద్రరావు,చోడే సూరిబాబు,  నక్కాసింహాచలం,బోనం సత్తిబాబు,బడుగు రాంబాబు ఉన్నారు.

Comment here