Andhra PradeshEast GodavariNews

సహాయ చర్యలు అందిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్.

సహాయ చర్యలు అందిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్.

కోస్తా ఎన్ కౌంటర్ టి నర్సాపురం. పశ్చిమగోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం లో టి నరసాపురం గ్రామం ఎర్ర చెరువు లో ముంపుకు గురైన బాధితులను సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబరావు స్థానిక నాయకుల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుస్తున్న భారీ వర్షాలు వలన ప్రమాదాలకు గురి కాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని పెద్ద వయసు ఉన్న వారు ఏర్పాటు చేసిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన తెలిపారు. స్థానిక వైయస్సార్ సిపి నాయకులు దేవరపల్లి సీతారాం ప్రసాద్ ఆధ్వర్యంలో పునరావాసం ఏర్పాటుచేసి బాధితులకు భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు కన్నం సర్వేశ్వరరావు, పిరయ్య,కె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comment here