Andhra PradeshEast GodavariNews

సామూహిక సీమంతం నిర్వహించిన మహిళా మోర్చా

సామూహిక సీమంతం నిర్వహించిన మహిళా మోర్చా
    భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మ దినోత్సవం సందర్భంగా సేవా సమర్పణ అభియాన్  లో భాగంగా రాజమండ్రి పార్లమెంట్ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు  ఆకుల నర్సవేణి  ఆధ్వర్యాన   రాజమండ్రి రూరల్ మండలం కాతేరు శాంతి నగర్ లో   గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార వితరణ, సామూహిక శ్రీమంతం కార్యక్రమం బుధవారం  నిర్వహించా రు.  రాష్ట్ర ఉపాధ్యక్షురాలు  రేలంగి శ్రీదేవి ముఖ్య అతిగా  పాల్గొంటూ, గర్భిణీ స్త్రీలకు కేంద్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోందన్నారు.   మహిళలకోసం  మోడీ ఎన్నో పధకాలను ప్రవేశ పెట్టారనీ వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు పన్నాల వెంకట లక్ష్మి, రాజమండ్రి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు తంగెళ్ళ పద్మావతి, రూరల్ మండల అధ్యక్షురాలు మువ్వల శ్రీలక్ష్మీ ,బిజెపి  మండల ఉపాధ్యక్షులు ధనాల రామలక్ష్మీ,  జిల్లా మహిళా నాయకులు వెంకట లక్ష్మీ, సుశీల , మహాలక్ష్మి , దుర్గా వర్థిని ,బిజెపి  రూరల్ మండల అధ్యక్షుడు యానాపు ఏసు , మన్నెం శ్రీనివాస్, అనిల్, బండి సత్య ప్రసాద్, తదితరులు  పాల్గొన్నారు.

Comment here