Andhra PradeshEast GodavariNews

సారా త్రాగడం వల్ల వచ్చే అనార్థాలపై ప్రజలకు అవగాహన

సారా త్రాగడం వల్ల వచ్చే అనార్థాలపై ప్రజలకు అవగాహన
కోస్తాఎన్ కౌంటర్,గండేపల్లి : గండేపల్లి ఎస్సై శోభన్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి గండేపల్లి మండలం మురారి గ్రామం లో ప్రజలకు నాటుసారా త్రాగడం వల్ల వచ్చే అనార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించడమే కాకుండా పురుషులతో నాటుసారా నిషేదించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శోభన్ కుమార్ మాట్లాడుతూ..గ్రామంలో నాటుసారా అమ్మే వారి వివరాలు సేకరించడం జరిగిందని,అదే విధంగా గతంలో సారా కేసులో పట్టుపడ్డటవంటి వ్యక్తుల వివరాలను సేకరించామని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు,మహిళల సహకారంతో నాటుసారా అమ్మకందారులు ఇళ్లకు వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.ఎవరైనా అక్రమంగా నాటు సారా తయారీకి పాల్పడిన, అమ్మిన, అక్రమ రవాణా జరిపిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సారా నిర్మూలన రహిత గ్రామంగా మురారిని తీర్చిదిద్దుతామని గ్రామస్తులు హామీ ఇచ్చినట్లు ఎస్ఐ శోభన్ కుమార్ తెలిపారు తెలిపారు.

Comment here