Andhra PradeshEast GodavariNews

సారా వద్దు ఆరోగ్యం ముద్దు పై అవగాహన కార్యక్రమం.

సారా వద్దు ఆరోగ్యం ముద్దు పై అవగాహన కార్యక్రమం.

కోస్తా ఎన్ కౌంటర్ టి నర్సాపురం. పశ్చిమ గోదావరి జిల్లా టీ నర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామంలో  పరివర్తన కార్యక్రమంపై సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వారు తెలిపారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటే మన కుటుంబంతో పాటు మన ఊరు కూడా అభివృద్ధి పొందుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబరావు, సిబ్బంది, మరియు ఎక్సైజ్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comment here