Andhra PradeshEast GodavariNews

సినీ ఫక్కీలో ఛేజింగ్ ‘గోకవరంలో గంజాయి పట్టివేత’

గోకవరంలో గంజాయి పట్టివేత

* సినీ ఫక్కీలో ఛేజింగ్
* చాకచక్యంగా పట్టుకున్న గోకవరం ఠాణా దారు పృద్వి కుమార్

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  వాయు వేగంతో దూసుకుపోయిన గంజాయి వాహనం… వెనకాల పోలీసులు బైక్స్ పై ఛేజింగ్.. ఫోన్లు ద్వారా అందరికి సమాచారం…రోడ్డుకు అడ్డంగా బైక్స్ పెట్టి పట్టుకున్న వైనం… సినిమాలో సీన్స్ కి ఏ మాత్రం తగ్గని రీతిలో జరిగిన రియల్ సంఘటన. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గోకవరం ఠాణా సెంటర్లో విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ ఉద్యోగి పృద్వి కుమార్ కి ఫోన్ వచ్చింది. ఏజెన్సీ ప్రాంతం మీదుగా వేగంగా ఒక వాహనం వస్తుందని, ఫోక్స్ పేట అటవీశాఖ సెంటర్ వద్ద ఆపినా ఆగకుండా వెళ్ళిపోయిందని, వెంటనే కారుని వెళ్లనీయకుండా పెట్టుకోవాలని చెప్పారు. వెంటనే పృథ్వి కుమార్ తనతో ఉన్న వ్యక్తి సహాయంతో రోడ్డు కు అడ్డంగా బైక్స్ పెట్టాడు. వచ్చే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తు, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేశారు. ఇంతలో ఫోన్ లో చెప్పిన గుర్తులు గల వాహనం వేగంగా వస్తుండటంతో బైక్స్ ని రోడ్డుకు అడ్డంగా వేశారు. కారు ఆగిన వెంటనే డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తిని పట్టుకున్నారు. తమ అటవీశాఖ కార్యాలయంలో కూర్చోబెట్టారు. ఇంతలో రంపచోడవరం పోలీసులు ఛేజింగ్ చేసుకుంటూ వచ్చారు. ఏడు కిలోమీటర్లు నుండి ఛేజింగ్ చేసుకుంటూ వస్తున్నామని, కారుని తనిఖీ చేశారు. వరసగా పేర్చిన గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు పృథ్వి కుమార్ తెలిపారు. కారుని ,వ్యక్తి ని వెంటనే రంపచోడవరం పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఎక్కడ నుండి గంజాయి తెస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు రంపచోడవరం పోలీసులు తెలుసుకుంటున్నారు. కొద్దిసేపు గోకవరం ఠాణా సెంటర్ మాత్రం గందరగోళం గా మారిపోయింది. ఎందుకంటే రోడ్డు పై బైక్స్ అడ్డంగా పెట్టి, కారు ని అడ్డగించటం, వెంటనే డ్రైవర్ని అదుపులోకి తీసుకోవటం చాలా వేగంగా జరిగాయి. ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి, గంజాయి కారుని పట్టుకోవటంలో కీలకపాత్ర పోషించిన అటవీశాఖ ఉద్యోగి పృథ్వి కుమార్ ని అభినందించాల్సిందే.

Comment here