Andhra PradeshEast GodavariNews

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి..

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి..
` క్వారీ గోతుల్లో గంబూషీయా చేపలు వదలాలి
స్టాండిరగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బర్రే కొండబాబు
కోస్త ఎన్ కౌంటర్, రాజమహేంద్రవరం సిటీ ;
షర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయని ముఖ్యంగా దోమలు పెరిగిపోవడంతో డెంగీ, చికెన్‌ గున్యా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ స్టాండిరగ్‌ కమిటీ మాజీ చైర్మన్‌, వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు బర్రే కొండబాబు కోరారు. క్వారీ ప్రాంతంలోని 20 పేటల్లో దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ మేరకు సోమవారం నగరపాలకసంస్థ అదనపు కమీషనర్‌ ఎంవివి సత్యనారాయణను స్పందన కార్యక్రమమంలో కలిసి వినతి పత్రం అందచేసారు. ఇంటింటికీ నిలవనీరు ఉండకుండా చర్యలు చేపడుతున్నారని అయితే ఇక్కడి ప్రమాదకరమైన క్వారీ గోతుల్లో వర్షం నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయన్న విషయం అందరికి తెలిసిందేనన్నారు. ఈ నీటిలో నాచుపట్టి అపరిశుభ్రంగా ఉందని ఈ నిలువ నీటిలో దోమలు పెరిగిపోతున్నాయని దీంతో ఈ ప్రాంత ప్రజలు డెంగీ, చికెన్‌, గున్యా, మలేరియా వంటి వ్యాధులు సోకుతాయని భయపడుతున్నారని పేర్కొన్నారు. దోమల నివారణకు క్వారీ గోతుల నీటిలో గంబూషీయా చేపలను వదలాలని విజ్ఞప్తి చేసారు. గతంలో దోమల నివారణకు ఈ చేపలను వదిలేవారని, ఇప్పుడు కూడా తక్షణం తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ప్రాంతంలో కంపోస్టు యార్డుతో పాటు వెహికల్‌ యార్డు కూడా ఉందని, పేదలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో దోమలను నివారించి డెంగ్యూ, చికెన్‌ గున్యా, మలేరియా వంటి వ్యాధుల బారినుంచి ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేసారు. 52వ వార్డులో ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బందిని ఆర్‌ అండ్‌ బి అతిథి గృహానికి వచ్చే వి.ఐ.పి.ల కోసం, విమానాశ్రయానికి వచ్చే అతిథుల సేవల కోసం వినియోగిస్తున్నారని, దీంతో వార్డులో పారిశుద్ధ్య పనులు చేసే సిబ్బంది కొరత ఉందన్నారు. దీని వలన వార్డులోని వివిధ పేటల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదని, పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్య పెంచడంతో పాటు దోమల నివారణకు చర్యలు చేపట్టాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో స్థానికులు శివకోటి కుమారి, బోడపాటి అరుణ్‌, కానేటి స్వాతి, జువ్వల రాజేష్‌, దొంతుమళ్ల రామ్‌కుమార్‌, పరిసే అనిల్‌కుమార్‌, త్రిపురాల రాజ్‌కుమార్‌, అశోక్‌, కెఎస్‌ రత్నం, కె.దీపిక తదితరులు పాల్గొన్నారు.

Comment here