Andhra PradeshEast GodavariNews

*సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలి*

*సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలి*
 గ్రామాల్లో ప్రాధమిక వైద్యం అందించే పీఎంపీలు  సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని నారాయణరెడ్డి హాస్పిటల్ వైద్యనిపుణులు డాక్టర్ ఖాసిమ్ ఖాన్, డాక్టర్ యూసఫ్ లు అన్నారు.ఆదివారం ది పీఎంపీ అసోసియేషన్ ఆలమూరు, మండపేట మండలాల ఆధ్వర్యంలో పీఎంపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోన సత్యనారాయణ అధ్యక్షతన స్థానిక నారాయణరెడ్డి హాస్పిటల్ ఆవరణలో సీజనల్ వ్యాధులపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న వైద్యనిపుణులు మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలు, ఈగల వల్ల వైరస్ బ్యాక్టీరియా వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులయిన టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, డయేరియా,ఫైలేరియా,మెదడువాపు తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో ప్రాధమిక వైద్య సేవలందించే పీఎంపీలు ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు కనుక ఈ వ్యాధులపై అవగాహన కలిగి ఏది సీజనల్ వ్యాధో,కరోనా వ్యాధో ముందుగా గుర్తించి త్వరతిగతిన చికిత్స అందేలా చూడాలని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలతో ప్రాధమిక వైద్యం అందించాలని సూచించారు. ఈ సదస్సులో నారాయణరెడ్డి ఆసుపత్రి అధినేత నారాయణరెడ్డి, పీఎంపీ రాష్ట్ర గౌరవ సలహాదారు కేఎస్ఎన్ బాబు, జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులు జేవీవీ సూర్యనారాయణ మూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూరంపూడి వీరభద్రరావు, మండల కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, కోశాధికారి వీకే రాజు లతో పాటు వందమంది సభ్యులు హాజరయ్యారు

Comment here