Andhra PradeshEast GodavariNews

*సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి*

*సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి*

*కోస్తా ఎన్ కౌంటర్ రాయవరం:* వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సోమేశ్వరం గ్రామ సర్పంచ్ ఆరీఫ్ విజ్ఞప్తి చేశారు. గులాబ్ తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు కురియడంతో గ్రామంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ప్రబలి, విష జ్వరాలు ప్రజలను బాధిస్తున్న తరుణంలో నీరు నిల్వ లేకుండా వర్షపు నీరు బయటికి పోయే విధంగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో పర్యటించి వీధుల్లో ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించడంతోపాటు, డ్రైన్లును శుభ్రం చేయించారు. వర్షం తగ్గిన వెంటనే దోమల నివారణ మందు పిచికారి చేయించనున్నట్లు ఆయన తెలిపారు.

Comment here