Andhra PradeshEast GodavariNews

సోనుసూద్ కోసం  సామాన్యుడు

సోనుసూద్ కోసం  సామాన్యుడు
•1450కిలోమీటర్లు…స్కూటీపై
•జగ్గంపేట టూ వయా ముంబాయి
•ఎల్లలు దాటిన అభిమానం
•గొప్ప ఉదార స్వభావుడు సోనుసూద్
కోస్తా ఎన్ కౌంటర్, కాకినాడ రూరల్: కరోనా కల్లోలం కరాళ నృత్యం వేళ..ప్రపంచమంతా లాక్ డౌన్లో ఉంది. బ్రతుకుదెరువు కోసం కుటుంబాలతో సహా దేశంలోని
వివిధ ప్రాంతాలకు చిన్నాపిల్లలతో వలసవెళ్లిన కూలీలు స్వగ్రామానికి వెళ్లేందుకు అవకాశం లేక…చేతిలో డబ్బులు లేక..ఎక్కడికక్కడే లాక్ డౌన్తో అష్టకష్టాలు పడుతున్న నిరుపేదలు, వలస కూలీలు, విద్యార్థులను ఎంతో మందిని తన ఉదార తన
ఉదార స్వభావంతో నేనున్నానంటూ ముందుకొచ్చి ఆపన్నహస్తం అందించిన…బాలీవుడ్ నటుడు సోనుసూద్ ను కలుసుకోవాలని భావించాడు. జీవితంలో ఆయన్ని ఒక్కసారైనా చూచి తీరాలనే తలంపుతో తన వృద్ధాప్యాన్ని సైతం మరచి…స్కూటీపై జగ్గంపేట నుంచి ముంబాయికి వెళ్లిన ఓ చిరు బట్టల వ్యాపారి బొండా సోమరాజు
మనసున్న మారాజు సోనూసూద్ పై ఎల్లలు దాటిన అభిమానాన్ని చాటుకున్నాడు.ఎట్టకేలకు అయిదు రోజులపాటు సింగిల్ గా స్కూటీపై వెళ్లి స్వయంగా సోనూసూద్ ను కలుసుకుని ఉప్పెంగిపోయాడు. ఆయనే బొండా సోమరాజు…
జగ్గంపేట టూ ముంబాయి….
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన 69 ఏళ్ల బొండా సోమరాజు  బట్టలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనోపాధి పొందు
తున్నాడు.కరోనా మొదటి,రెండోదశలో లాక్ డౌన్, ఆంక్షలతో ఉన్నంతలో కొంత మేర బట్టల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాడు.కొవిడ్ లాక్ డౌన్ సమయంలో నిరుపేదలు, వలసకూలీలు పడుతున్న ఇబ్బందులు స్వీయగా అనుభవించాడు. జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలసకూలీలు, నిరుపేదల పడుతున్న ఇబ్బందులను చూచి చలించిపోయిన సినీ నటుడు సొనూసూద్ ఆపన్నహస్తం అందించడం వేలాది మందిని ఇంటికి చేర్చడంతో సోనూసూద్ చేస్తున్న సామాజిక సేవలను
చూచి చలించిపోయాడు. జీవితంలో ఒక్కసారైనా సోనూసూద్ ను కలుసుకోవాలని ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు.అక్కడకు ఎలాగా వెళ్లాలి..తెలుగు తప్ప, ఇతర భాష రాని తను ఏవిధంగా ముంబాయి వెళ్లాలి  ఎలా ఆయన్ని కలవాలని సతమతమవుతూ రోజుల తరబడి ఆలోచించాడు.చివరకు ఆగస్టు 15వతేదీన మధ్యాహ్నం 12.45 గంటలకు తన స్కూటీపై బయలుదేరి ఆరు రోజుల పాటు పగలు ప్రయాణించి సుమారు 1450 కిలోమీటర్లు దాటుకుని ఎట్టకేలకు 20వతేదీన ముంబాయికి చేరుకున్నాడు. అక్కడ స్థానికులను అడిగి సోనూసూద్ నివసిస్తున్న ముంబాయి యమునానగర్ అడ్రాసును తెలుసుకుని
ఎన్నాళ్ల నుంచే వీరాభిమానిని చూడాలని వందలాది కిలోమీటర్లు దాటుకుని వచ్చిన వేళ ఆవిప్క్రతం అయింది.సుమారు సోనూసూద్ సుమారు 20 నిమిషాలపాటు సోమరాజుతో మాట్లాడారు. సోనూసుద్ ను కలుసుకోవడం తనకు జీవితంలో
ఎంతో ఆనంద్నాన్నించిందని, ఓ భగవంతుడ్ని చూచిన ఆనందం కలిగిందని, నిరుపేదలకు ఆయన చేసిన సేవలు మరవలేనని సోమరాజు తెలిపారు. ఈనెల 20వ తేదీన సోనూసూద్ ను
కలుసుకున్నానని, ఆయన ఎంతో ఆత్యీయంగా పలుకరించారని, అంత దూరం నుంచి ఎలా ప్రయాణించావు,ఆరోగ్యం జాగ్రత్త, కుటుంబం
జాగ్రత్త అంటూ తనపై అభిమానాన్ని చాటుకోవడం జీవితంలో మరచిపోలేననితెలిపారు.చాలా సింపుల్ గా,సాధారణ మనిషిలా ఉన్నారన్నారు. మంగళవారం తన స్కూటీపై సోమరాజు ఇంటికి చేరుకున్నారు.

Comment here