Andhra PradeshEast GodavariNews

హాస్టల్స్ లో ఆరోగ్య పరీక్షలు..

హాస్టల్స్ లో ఆరోగ్య పరీక్షలు..

కోస్తా ఎన్ కౌంటర్, గోకవరం:  మండలంలో తిరుమలాయ పాలెం గ్రామంలోను భూపతిపాలెం గురుకుల పాఠశాల లోను సీజనల్ జ్వరాలకు  సర్వలెన్సు ఆరోగ్యపరీక్షలు సంబంధిత గ్రామాలలో చేపట్టడమైనది. తిరుమలాయపాలెం నందు డెంగీ కేసు నమోదైనందున ఆగ్రామములో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసరాజు వైద్య ఆరోగ్య సిబ్బంది కేస్ పరిసర ములలో   ప్రతీ ఇంటికీ తిరిగి రక్త నమూనాలు సేకరించి పారిశుద్ధ్య కార్యక్రమంలు చేపట్టారు.ఈ కార్యమాలను ఏ.పి.డి.ఓ.కిశోరకుమార్,ఈ.ఓ.పి.ఆర్.డి.రాజేశ్వర్రావులు పర్యవేక్షించారు. భూపతి పాలెంనందు అనుమానిత విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు చేసి నమూనాలను కాకినాడ పంపించారు.ఈ కార్యక్రమములో డా.సురేష్,డా.విజయలక్మి పరీక్షలు నిర్వహించారు.ఈ కొత్తపల్లి పి.హెచ్.సి.సి.హెచ్.ఓ. మేరీ కృప, ఏ.
పి.హెచ్.ఏ.ఓ.వై.యెస్.రాయుడు, హెచ్.వి.అరుణోనమ్మ, పి.హెచ్.ఎన్. భారతి, ఆరోగ్య సిబ్బంది హెచ్.ఏలు మట్ట.శ్రీను,పూడిఅప్పారావు,నాగేశ్వరరావుఏ.ఏన్. ఎమ్ లు పుష్ప,రమాదేవి ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు,

Comment here