Andhra PradeshEast GodavariNews

హెచ్‌ఐవీ,ఎయిడ్స్‌ బాధితులను ఆదరించాలి

హెచ్‌ఐవీ,ఎయిడ్స్‌ బాధితులను ఆదరించాలి
తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సు…..
కోస్తా ఎన్‌కౌంటర్‌ తాడేపల్లిగూడెం : హెచ్‌ఐవీ,ఎయిడ్స్‌ బాధితులను ప్రేమతో ఆదరించాలని ఆరుగొలను సర్పంచ్‌ పీతల బుచ్చిబాబు అన్నారు. చైల్డ్‌ ఇండియా లింక్‌ వర్కర్స్‌ స్కీమ్‌, రాష్ట్ర ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కరోనా, రక్తదానం, హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై మండలంలోని ఆరుగొలను గ్రామంలో అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ పీతల బుచ్చిబాబు మాట్లాడుతూ అంటుకుంటే వచ్చే వ్యాధి కాదని, రక్షణ లేని వివాహేతర సంబంధాల వల్ల హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వస్తుందన్నారు. మందులు ద్వారా జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్‌ ఫండ్‌ ఇండియా లింక్‌ వర్కర్స్‌ స్కీమ్‌ కె.దాసుబాబు, లింక్‌ వర్కర్‌ బివి.లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ఎస్‌.శ్రీనివాస్‌, ఏఎన్‌ఎం విజయ, గ్రామ వలంటీర్లు పాల్గొన్నారు.

Comment here